Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






కక్ష్యలో శకలాలను మిగల్చని పీఎస్‌ఎల్‌వీ

→ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ మరో మైలురాయిని సాధించింది.
→ ప్రయోగానంతరం భూకక్ష్యలో ఎలాంటి శకలాలకు తావులేని ‘జీరో ఆర్బిటల్‌ డెబ్రీ మిషన్‌’ను విజయవంతంగా చేపట్టింది.
→ పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌-3 (పోయెమ్‌-3) మార్చి 21న భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది.
→ ఫలితంగా ఆ రాకెట్‌ ప్రయోగం వల్ల కక్ష్యలో ఎలాంటి శకలాలు ఉత్పన్నం కాలేదని ఇస్రో పేర్కొంది.
→ పీఎస్‌ఎల్‌వీ-సి58 రాకెట్‌ను ఈ ఏడాది జనవరి 1న ప్రయోగించారు. అది తనతోపాటు పంపిన ఉపగ్రహాలన్నింటినీ నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది.
→ అనంతరం ఆ రాకెట్‌లోని తుది దశ.. ‘పోయెమ్‌-3’ వేదికగా రూపాంతరం చెందింది. అందులోని సాధనాలన్నీ నెల రోజుల్లో ప్రయోగాలు పూర్తిచేశాయి.
→ భూ వాతావరణ ప్రభావంతో అది క్రమంగా కిందకి దిగడం మొదలైంది.
→ మార్చి 21న ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రానికి ఎగువన వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి