Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






తేజస్‌ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం

→ తేజస్‌ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్‌ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
→ పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది.
→ బెంగళూరులోని ఆ సంస్థ ప్రాంగణం నుంచి టేకాఫ్‌ అయిన ఎల్‌ఏ-5003.. 18 నిమిషాల పాటు గాల్లో విహరించి సురక్షితంగా ల్యాండ్‌ అయింది.
→ పైలట్‌ గ్రూప్‌ (విశ్రాంత) అధికారి కెప్టెన్‌ కె.కె.వేణుగోపాల్‌ ఈ విమానాన్ని నడిపారు.
→ హెచ్‌ఏఎల్‌ ప్రయాణంలో ఇదో మైలురాయి అని ఆ సంస్థ సీఎండీ సి.బి.అనంతకృష్ణన్‌ అభివర్ణించారు.
→ విమానం తయారీకి సహకరించిన రక్షణ శాఖ, వైమానికదళం, డీఆర్‌డీఓ సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి