Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న ఆరు జన్యువులు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆరు జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిశోధన తేల్చింది.
→ భావోద్వేగ స్పందన వంటివాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయని, తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, పనితీరు, దార్శనికత వంటివాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది.
→ ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానవుడి వరకూ.. పరిణామక్రమంలో మార్పులకు లోనుకాకుండా ఈ జన్యువులు చాలా భద్రంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ భూమి మీద జీవుల వ్యవహారశైలి నిర్ధారణలో అవి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.
→ పరిశీలనయోగ్యమైన లక్షణాలు, వ్యవహారశైలిగా జన్యువులు మారుతుంటాయి. దీన్ని జన్యు వ్యక్తీకరణగా పిలుస్తారు.
→ ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశీలించేందుకు స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నేతృత్వంలో అంతర్జాతీయ బృందం పరిశోధన నిర్వహించింది.
→ ఇందులో భాగంగా గత నాలుగు దశాబ్దాల్లో ఫిన్లాండ్‌లోని 459 మందికి సంబంధించి సేకరించిన డేటాను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించారు.
→ ఆయా వ్యక్తుల ఆరోగ్యం, శారీరక స్థితి, జీవనశైలితో పాటు వ్యక్తిత్వంతో ముడిపడిన అలవాట్లు, భావోద్వేగ స్పందన, లక్ష్యాలు, విలువలు వంటి వివరాలను సేకరించారు.
→ వ్యక్తిత్వం ఆధారంగా జన్యువుల వ్యక్తీకరణ, సమూహంగా ఏర్పడటం వంటివి జరుగుతున్నట్లు ఇందులో గుర్తించారు.
→ మెదడులోని నిర్దిష్ట ప్రాంతాల్లో 4వేల జన్యువుల వ్యక్తీకరణతో కూడిన నెట్‌వర్క్‌ను వారు గమనించారు.
→ వారసత్వంగా మానవ వ్యక్తిత్వం సంక్రమించడానికి వీటిలో కొన్ని కారణమవుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
→ ఇవి కొన్ని సమూహాలుగా ఏర్పడుతున్నాయని, తద్వారా పలు మాడ్యూళ్లుగా రూపాంతరం చెందుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ ఇవి జన్యువ్యక్తీకరణను నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు.
→ సంబంధిత వ్యక్తి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేలా చేస్తున్నాయని గుర్తించారు.
→ ఈ మాడ్యూళ్లు సులువుగా ఆన్, ఆఫ్‌ అవుతున్నాయని, తద్వారా మనం రోజువారీ ఎదుర్కొనే సవాళ్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు వివరించారు.
→ భావోద్వేగాలు, ఆ మాడ్యూళ్ల కట్టడి బాధ్యతను ఆరు జన్యువులతో తయారైన ఒక నియంత్రణ కేంద్రం చూస్తోందని చెప్పారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి