Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






బ్రిటన్‌లో క్యాన్సర్‌కు వినూత్న చికిత్స

→ క్యాన్సర్‌ బాధితులకు విప్లవాత్మక చికిత్సలను తెచ్చేందుకు బ్రిటన్‌లో ప్రారంభించిన వినూత్న పథకం ఆశలు చిగురింపచేస్తోంది.
→ దీని కింద ‘కార్‌ టి’ అని ఈ చికిత్సను భారత సంతతికి చెందిన యువన్‌ ఠక్కర్‌ మొట్టమొదట పొందారు.
→ అది ఫలించి ఇప్పుడు తనకు ఇష్టమైన పనులను చేసుకోగలుగుతున్నానని అతడు చెబుతున్నాడు.
→ బ్రిటన్‌ ప్రభుత్వ నిధులతో నడిచే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌.. క్యాన్సర్‌ డ్రగ్స్‌ ఫండ్‌ (సీడీఎఫ్‌)ను ఏర్పాటుచేసింది. 2016 జులైలో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
→ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ కేర్‌ ఎక్సెలెన్స్‌ (నైస్‌) ఆమోదం పొందిన అన్నిరకాల క్యాన్సర్‌ చికిత్సలకు వేగంగా బాధితులకు అందుబాటులోకి తీసుకురావడం, ఆ చికిత్స విధానాల దీర్ఘకాల సమర్థతపై మరిన్ని ఆధారాలు సేకరించడం దీని ఉద్దేశం.
→ దీనిద్వారా వందకుపైగా ఔషధాలను రోగులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీని ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య లక్షకు చేరింది. వీరిలో ఠక్కర్‌ కూడా ఉన్నాడు. ఆరేళ్ల వయసులో అతడికి ఒకరకం లుకేమియా వచ్చింది.
→ కీమోథెరపీ, బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ వంటి ఇతర చికిత్సలు విఫలమయ్యాక 2019 అతడికి ‘కార్‌ టి’ చికిత్సను ఇచ్చారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి