చంద్రునిపై సమయ ప్రమాణాన్ని రూపొందించాలని నాసాను ఆదేశించిన వైట్ హౌస్
భవిష్యత్తులో చంద్రుడిపై టైం ఎంతైందో కూడా తెలుసుకోనున్నాం. జాబిల్లి, ఇతర గ్రహాలపై సమయం తెలుసుకునేలా ఓ ఏకీకృత ప్రామాణిక సమయాన్ని (యూఎస్‌టీ) నిర్ధారించాలని శ్వేతసౌధం భావిస్తోంది.
→
ఇందుకోసం 2026 నాటికల్లా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి ప్రణాళికను సిద్ధం చేయాలని నాసాను శ్వేతసౌధం ఆదేశించింది.
→
ఈ సమయాన్ని ‘కోఆర్డినేటెడ్ లూనార్ టైం’ (సీఎల్‌టీ) అని పిలవనున్నారు.
→
అంతరిక్షంలో ప్రయాణించాలనుకునే నౌకలకు, ఉపగ్రహాలకు కీలకమైన సమయపాలన ప్రమాణాన్ని ఇది అందించనుంది.
→
గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధారణలో చోటుచేసుకునే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది.
→
సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు 58.7 మిల్లీ సెకన్లను కోల్పోతుందని శ్వేత సౌధంలోని ‘సైన్స్-టెక్నాలజీ విధానం’ అధిపతి ఆర్తి ప్రభాకర్ తెలిపారు.
→