హైపర్‌సోనిక్ క్షిపణి వివరాలు వెల్లడించిన ఉత్తరకొరియా
ఉత్తరకొరియా తాము పరీక్షించిన క్షిపణి వివరాలను వెల్లడించింది.
→
ఘన ఇంధనంతో దూసుకెళ్లే మధ్యశ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించామని తెలిపింది.
→
ఈ పరీక్షను అధినేత కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది.
→
101 కిలోమీటర్ల ఎత్తుకు క్షిపణి వెళ్లిందని, రాకెట్ లాంఛర్ నుంచి విడిపోయిన తర్వాత 1000 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిందని వెల్లడించింది.
→
దీన్ని దక్షిణకొరియా ఖండించింది. క్షిపణి కేవలం 600 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిందని, సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొంది.
→
ఈ ప్రయోగాన్ని దక్షిణ కొరియాతో పాటు.. జపాన్, అమెరికా ఖండించాయి.
→