క్యాన్సర్‌పై పోరుకు స్వదేశీ సీఏఆర్ టీ-సెల్ థెరపీ
క్యాన్సర్ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్ టీ-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు.
→
ఐఐటీ బాంబేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ‘‘మానవాళికి ఈ చికిత్సా విధానం కొత్త ఆశలు కల్పించింది.
→
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌ను ఎదుర్కొనేలా సీఏఆర్ టీ-సెల్ థెరపీని రూపొందించారు’’ అని రాష్ట్రపతి అన్నారు.
→
ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
→
ఇందులో రోగి టీ-సెల్‌లను (రోగ నిరోధక వ్యవస్థలోని ఒక రకమైన కణాలు) సేకరించి.. క్యాన్సర్ కణాలపై దాడి చేసి, నాశనం చేసేలా ప్రయోగశాలలో వాటిని తీర్చిదిద్దుతారు.
→
‘నెక్స్ సీఏఆర్19 సీఏఆర్ టీ-సెల్ థెరపీ’గా పిలిచే ఈ విధానం సాయంతో అనేక రకాల క్యాన్సర్‌లకు తక్కువ ధరల్లో సమర్థ చికిత్స అందించవచ్చు.
→