→డీఆర్‌డీఏ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) సారథ్యంలోని జీటీఆర్‌ఈ (గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్) అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ కోసం ‘ప్రొడక్షన్ ఏజెన్సీ’గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్‌ను ఎంపిక చేసింది.
→ఇంజిన్ విడిభాగాల ఉత్పత్తి, అసెంబ్లింగ్, టెస్టింగ్ కార్యకలాపాలను ఆజాద్ ఇంజినీరింగ్ నిర్వహిస్తుంది.
→రక్షణ రంగంలో వివిధ అవసరాల కోసం ఈ ఇంజిన్‌ను వినియోగిస్తారు. 2026 నుంచి ఇంజిన్లు అందించనున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది.
→జీటీఆర్‌ఈ కోసం పనిచేయడం అంటే, ఇంజినీరింగ్ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి విభాగాల్లో తమ నైపుణ్యం, అనుభవానికి గుర్తింపు లభించినట్లేనని ఆజాద్ ఇంజినీరింగ్ ఛైర్మన్ రాకేష్ చాప్దార్ అన్నారు.