అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష విజయవంతం!
వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను రాత్రి సమయంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది.
→
ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ అణ్వస్త్ర సామర్థ్య క్షిపణి.. ప్రయోగ లక్ష్యాలన్నింటినీ అందుకొని సత్తా చాటింది.
→
అగ్ని ప్రైమ్ 1,000-2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
→
ఈ క్షిపణిని రాత్రివేళ విజయవంతంగా పరీక్షించినందుకుగాను వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ), రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)లతోపాటు సాయుధ బలగాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
→
2023 జూన్‌లో కూడా భారత్ ‘అగ్ని ప్రైమ్’ను రాత్రి సమయంలో విజయవంతంగా పరీక్షించింది.
→