మతిమరపును పసిగట్టడానికి అంతర్జాతీయ పరిశోధన!
తీవ్ర మతిమరపును కచ్చితత్వంతో గుర్తించడానికి అంతర్జాతీయ పరిశోధక బృందం నడుం బిగించింది.
→
వారిలో భారత సంతతి న్యూరాలజిస్టు అశ్వినీ కేశవన్ కూడా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ బృందానికి భారీ గ్రాంటు ఇచ్చింది.
→
ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధి వల్ల కలిగే తీవ్ర మతిమరపును గుర్తించడానికి మెదడు స్కాన్‌లు, జ్ఞాపకశక్తి పరీక్షలపై ఆధారపడుతున్నా, అవి అంత సమర్థమైనవి కావు. పీఈటీ స్కాన్ కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
→
కానీ, అది ఖరీదైన ప్రక్రియ. రోగుల్లో 2% మందికే అందుబాటులో ఉంది. అల్జీమర్స్ వ్యాధిని ముందే గుర్తించగలిగితే తీవ్ర మతిమరపును నివారించవచ్చు.
→
పి-టౌ217 అనే బయోమార్కర్ ద్వారా అల్జీమర్స్‌ను ముందుగానే పసిగట్టవచ్చా అనే అంశంపై లండన్ విశ్వవిద్యాలయ కళాశాలకు చెందిన అశ్వినీ కేశవన్ నాయకత్వంలోని బృందం పరిశోధన జరుపుతుంది.
→
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో రెండో బృందం ఇతర ప్రొటీన్లపై పరిశోధన చేపడుతుంది.
→
అల్జీమర్స్ వంటి వ్యాధుల వల్ల కలిగే తీవ్ర మతిమరపును రక్తంలోని ప్రొటీన్లు ముందుగానే పట్టిస్తాయని కేశవన్ తెలిపారు.
→
అందుకే ‘బ్లడ్ బయోమార్కర్ ఛాలెంజ్’ పేరిట బ్రిటిష్ శాస్త్రవేత్తలు అన్వేషణ మొదలుపెట్టారు.
→