అంతరిక్షంలోకి ‘టాటా’ ఉపగ్రహం!
భారత్‌లో అసెంబుల్ చేసి, పరీక్షించిన సబ్‌మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) సోమవారం ప్రకటించింది.
→
స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా దీన్ని రోదసిలోకి చేరవేసినట్లు తెలిపింది.
→
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
→
టీశాట్-1ఏ అనే ఈ ఉపగ్రహం.. హైరిజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందించగలదు.
→
మల్టీస్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ సామర్థ్యంతో వేగంగా ఫొటోలను భూమికి బట్వాడా చేయగలదు.
→
బ్యాండ్‌వ్యాగన్-1 మిషన్ కింద ఈ ఉపగ్రహాన్ని పంపినట్లు టీఏఎస్‌ఎల్ తెలిపింది.
→
టీశాట్-1ఏను కర్ణాటకలోని వేమగాల్‌లో ఉన్న తమ కర్మాగారంలో అసెంబుల్ చేసినట్లు వివరించింది.
→