రోదసిలోకి రష్యా సరికొత్త రాకెట్
చంద్రమండల యాత్రకు, గూఢచారి, కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్ అంగార-ఏ5ను రష్యా విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ రాకెట్ ప్రయోగం రెండు సార్లు సాంకేతిక సమస్యల వల్ల వాయిదాపడింది.
→
ముచ్చటగా మూడోసారి విజయవంతమై నింగికి ఎగసింది. ఇది సోవియట్ కాలంనాటి ప్రోటాన్ రాకెట్‌కు ఆధునిక రూపం.
→
కొత్తగా నిర్మించిన వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారను ప్రయోగించారు.
→