ఏఐ సహయంతో కణితుల తొలగింపు
మెదడులో కణితులను తొలగించేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కృత్రిమ మేధ(ఏఐ), ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) సాయంతో రూపొందించిన ప్రత్యేక పరికరంతో దేశంలోనే తొలిసారిగా 18 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు.
→
ఈ కొత్త విధానం గురించి కిమ్స్ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ పాణిగ్రహి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
→
‘స్కియా’ పేరుతో కొరియా సంస్థ రూపొందించిన ప్రత్యేక పరికరానికి మెదడులో కణితిని గుర్తించే కచ్చితత్వం ఉందని తెలిపారు.
→
కణితి అటూ, ఇటూ 1.5 మిల్లీమీటర్ దూరంలో ఏదైనా రక్తనాళం ఉన్నా గుర్తిస్తుందని వివరించారు.
→
కణితులను తొలగించేప్పుడు కుడి, ఎడమల గుర్తింపుపై అప్పుడప్పుడూ కలిగే సందేహాలకు తావుండదని చెప్పారు.
→
పాతపద్ధతిలో శస్త్రచికిత్సకు కనీసం నాలుగైదు గంటలు పడుతుందని, కొత్త విధానం ద్వారా గంటలోపు పూర్తవుతుందని చెప్పారు.
→
తలలో ఏ భాగంలో ఎంతవరకు కోతపడుతుందన్న వివరాలు రోగి కుటుంబసభ్యులకు ఈ పరికరం ద్వారా దృశ్యరూపంలో వివరిస్తామన్నారు.
→
ఆపరేషన్ సమయం 80శాతం వరకూ తగ్గిపోవడంతో రోగి త్వరగా కోలుకోవడమేగాక వారికి ఖర్చులు తగ్గనున్నాయని తెలిపారు.
→