అనారోగ్య ప్రధాన కారణాలపై అంతర్జాతీయ పరిశోధన
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది.→ ఈ వివరాలు.. ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.
→ ఈ అధ్యయనంలో భాగంగా.. కొవిడ్-19 మహమ్మారి విజృంభణ సాగిన మొదటి రెండేళ్లలో సగటు ఆయుర్దాయాన్ని పరిశోధకులు విశ్లేషించారు.
→ ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగినా.. వారి జీవనం ఆరోగ్యంగా సాగడంలేదని ఇందులో వెల్లడైంది.
→ ‘‘అంతర్జాతీయంగా అనారోగ్యానికి ప్రధాన కారణం నడుం నొప్పి. దాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతమున్న చికిత్సలు సరిగా ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన డేమియన్ శాంటోమారో తెలిపారు.
→ దీన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కుంగుబాటు సమస్యలకు నిర్దిష్ట కాలంపాటు చికిత్సలు, ఔషధాలను కొనసాగిస్తే ప్రయోజనం ఉండొచ్చని తెలిపారు.
→ అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఇవి అందుబాటులో ఉండటంలేదన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో కుంగుబాటు సమస్యలు తీవ్రస్థాయిలో పెరిగినందువల్ల.. ఈ ఇబ్బంది ఉన్నవారికి చికిత్స అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
→ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన ఇతరత్రా దుష్ప్రభావాలు మహిళలపైనే ఎక్కువగా ఉందని చెప్పారు.
→ దీనిలో దీర్ఘకాల కొవిడ్, మానసిక సమస్యలు వంటివి ఉన్నాయన్నారు.
→ అయితే ఇన్‌ఫెక్షన్ వల్ల మహిళలతో పోలిస్తే పురుషులకే మరణం ముప్పు అధికంగా ఉందని వివరించారు.
→