→హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేశారు.
→ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి.
→ఆరు నెలల క్రితం దాదాపు రూ.30 కోట్లతో రోబోటిక్ శస్త్రచికిత్స సదుపాయాన్ని ఎంఎన్‌జేలో ప్రవేశపెట్టారు.
→దీనిపై ఆసుపత్రికి చెందిన నలుగురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ పొందారు.
→గతంలో రోబోటిక్ సర్జరీలు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువ.
→ఎంఎన్‌జేలో ఏర్పాటుచేసిన సదుపాయాలతో పేదలకు ఎంతో ఉపశమనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
→ఈ శస్త్ర చికిత్సలు చేసే చోట పెద్దకోతల అవసరం ఉండదు. రక్తస్రావం, నొప్పి చాలా తక్కువ.
→ఎంఎన్‌జేలో ప్రస్తుతం రొమ్ము, గర్భసంచి, పురీషనాళం, పెద్దపేగు, అన్నవాహిక, పొట్ట తదితర క్యాన్సర్లకు రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్సలు చేస్తున్నారు.