కలరా టీకాలో కొత్త వెర్షన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది.
→
ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని వివరించింది.
→
కలరా ఉద్ధృతి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పేద దేశాలు ఇబ్బందిపడుతున్నాయి.
→
తాజా టీకాను ఈయూబయాలజీస్ రూపొందించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇప్పటికే వినియోగంలో ఉంది.
→
దానికి సంబంధించిన మెరుగైన వెర్షన్‌కు ఇప్పుడు ఆమోదం లభించింది. దీనికి యూవిచోల్-ఎస్ అని పేరు పెట్టారు.
→