Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






‘సైన్స్‌శక్తి’గా ఎదిగేందుకు భారత్‌ సిద్ధం

→ ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్‌.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్‌ వారపత్రిక ‘నేచర్‌’ పేర్కొంది.
→ ‘సైన్స్‌శక్తి’గా వృద్ధి చెందే దిశగా తదుపరి అడుగును వేయడానికి సిద్ధంగా ఉందని వివరించింది.
→ ఇందుకు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి కేటాయింపులు పెంచాలని సూచించింది.
→ ముఖ్యంగా ప్రైవేటు రంగం నుంచి మరింత చొరవ అవసరమని పేర్కొంది. ఈ మేరకు పత్రిక సంపాదకీయం రాసింది.

→ ముఖ్యాంశాలివీ:-
→ భారత్‌లో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ప్రాథమిక పరిశోధనలను నిర్లక్ష్యం చేశాయి. పరిశోధన వ్యవస్థకు మరింత స్వయంప్రతిపత్తి అవసరం.
→ పరిశోధనలకు వ్యాపార సంస్థలు మరింత ఎక్కువగా నిధులు సమకూర్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అగ్రదేశాల్లోనూ ఇదే జరుగుతోంది. భారత్‌లో విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు ఈ దిశగా అడుగులు వేస్తే దేశ శాస్త్రీయ పురోగతి మరింత ఊపందుకుంటుంది.
→ 2021-22 డేటా ప్రకారం ప్రపంచంలోనే మూడో పెద్ద ఔషధ పరిశ్రమ భారత్‌లో ఉంది. చౌకలో ఔషధాలు, జనరిక్‌ డ్రగ్స్‌ను సరఫరా చేస్తోంది. ఇందులో కొన్ని మందులు.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారిపై పోరాడటంలో కీలకంగా మారాయి.
→ గత ఏడాది చందమామపై సాఫీగా వ్యోమనౌకను దించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. అలాగే ఈ దేశం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల సమూహం ఉంది.
→ పరిశోధన ఫలితాల విషయంలో అగ్రదేశాల సరసన భారత్‌ ఉంది. 2014 నుంచి 2021 మధ్య విశ్వవిద్యాలయాల సంఖ్య 760 నుంచి 1,113కు పెరిగింది. కొత్తగా ఏడు ఐఐటీలు ఏర్పాటయ్యాయి. దీంతో వాటి సంఖ్య 23కు పెరిగింది. అదే కాలంలో కొత్తగా రెండు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి.
→ 2020-21లో జీడీపీలో 0.64 శాతం మేర మాత్రమే ఖర్చుపెట్టి, ఈ ఫలితాలను భారత్‌ సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆర్‌ అండ్‌ డీపై వ్యయాన్ని ఎలా పెంచాలన్నదానిపై ఆలోచన చేయాలి.
→ భారత పరిశోధన వ్యయంలో 60 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలే చేస్తున్నాయి. 40 శాతం ప్రైవేటు రంగంలో జరుగుతోంది. ఇదే స్థాయి ఉన్న దేశాల్లో ప్రైవేటు వాటా కొంచెం ఎక్కువగా ఉంటోంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి