Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం

→ దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా రూపొందించింది.
→ ఇది అత్యధిక స్థాయి ‘లెవల్‌ 6’ ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని ఓ అధికార ప్రకటన పేర్కొంది.
→ దీని తయారీకి వినూత్న డిజైన్, పదార్థం, ప్రక్రియలను ఉపయోగించినట్లు తెలిపింది.
→ కాన్పుర్‌లో డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) దీన్ని అభివృద్ధి చేసింది.
→ దీన్ని ఇటీవల చండీగఢ్‌లోని ల్యాబ్‌లో విజయవంతంగా పరీక్షించారు.
→ ఇది 7.62×54 ఆర్‌ ఏపీఐ తూటాలనూ నిలువరిస్తుందని అధికారులు తెలిపారు. దీని ముందు భాగం ఆరు స్నైపర్‌ తూటాలను అడ్డుకోగలదని చెప్పారు.
→ దీన్ని మోనోలిథిక్‌ సిరామిక్‌ ప్లేటు, పాలిమర్‌తో తయారుచేసినట్లు వివరించారు.
→ ఆపరేషన్ల సమయంలో ధరించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి