కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
→ చైనా తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది.→ యె గువాంగ్‌ఫు, లీ కాంగ్, లీ గువాంగ్సు అనే ఈ ముగ్గురు వ్యోమగాములు షెంఝౌ-18 వ్యోమనౌకలో నింగిలోకి పయనమయ్యారు.
→ లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ దీన్ని మోసుకెళ్లింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికైంది.
→ ఈ వ్యోమగాములు భూకక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం ‘తియాంగాంగ్’లో ఆరు నెలలు పాటు విధులు నిర్వర్తిస్తారు.
→