Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






చంద్రయాన్‌-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం

→ చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3.. ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది.
→ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది.
→ ‘కొలిజన్‌ ఆన్‌ లాంచ్‌ అవాయిడెన్స్‌’ (కోలా) విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
→ చంద్రయాన్‌-3 వ్యోమనౌకను ఎల్‌వీఎం-3 రాకెట్‌ ద్వారా గత ఏడాది జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే.
→ నాడు ప్రయోగంలో నాలుగు సెకన్ల పాటు జాప్యం చేయడం వల్ల చంద్రయాన్‌-3 వ్యోమనౌకకు ముప్పు తప్పింది.
→ అది ఎలాంటి ఇబ్బంది లేకుండా చందమామ దిశగా పయనం సాగించగలిగింది.
→ ఇలాంటి ముప్పును తప్పించుకోవడానికి గత ఏడాది జులై 30న పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగాన్ని నిమిషం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
→ దానికి మూడు నెలల ముందు (ఏప్రిల్‌ 24న) సింగపూర్‌కు చెందిన టెలియోస్‌-2 ఉపగ్రహ ప్రయోగంలోనూ ఇలా స్వల్ప జాప్యం చేయాల్సి వచ్చింది.
→ గత ఏడాది అంతరిక్ష వ్యర్థాల బారి నుంచి తన ఉపగ్రహాలను రక్షించుకోవడానికి ఇస్రో 23సార్లు విన్యాసాలు చేయాల్సి వచ్చింది.
→ గత 60 ఏళ్లలో అంతరిక్ష ప్రయోగాల వల్ల భూమి చుట్టూ రాకెట్, ఉపగ్రహ శకలాలు భారీగా పెరిగిపోయాయి.
→ వీటిని ఎప్పటికప్పుడు అంతరిక్ష సంస్థలు పరిశీలిస్తున్నాయి.

Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి