‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
→ చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది.→ న్యుబెవ్యాక్స్ 14; (బీఇ- పీసీవీ-14) అనే న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు లభించినట్లు సంస్థ ఇక్కడ వెల్లడించింది.
→ ‘వ్యాక్సిన్’ పీర్- రివ్యూ జర్నల్‌లో ఈ పరీక్షల ఫలితాలు ప్రచురించినట్లు పేర్కొంది.
→ దేశవ్యాప్తంగా 15 ప్రదేశాల్లో 6 నుంచి 8 వారాల వయస్సు గల 1290 మంది పసికందులపై ఈ టీకా ప్రయోగాలు నిర్వహించారు.
→