→గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగల రుద్రమ్-2 అనే క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
→వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
→ఒడిశాలోని బాలేశ్వర్ తీరానికి చేరువలో మే 29న ఉదయం 11.30గంటలకు ఈ పరీక్షను నిర్వహించారు.
→ఈ సందర్భంగా క్షిపణికి సంబంధించిన చోదక వ్యవస్థతోపాటు, నియంత్రణ, గైడెన్స్ అల్గోరిథమ్‌ల పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. పరీక్ష లక్ష్యాలన్నీ నెరవేరాయని వారు తెలిపారు.
→రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన అనేక ఆధునిక పరిజ్ఞానాలను ఈ క్షిపణిలో అమర్చారు.