Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






కొవిషీల్డ్‌తో కొన్ని దుష్పరిణామాలు!

→ కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది.
→ ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్‌’ ఓ కథనం ప్రచురించింది.
→ కొవిషీల్డ్‌ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొనట్లు తెలిపింది.
→ 100 మిలియన్‌ పౌండ్లకు కేసు: ఆస్ట్రాజెనకాపై బ్రిటన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
→ కొవిషీల్డ్‌ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్‌ హైకోర్టులో 50మందికి పైగా బాధితులు 100 మిలియన్‌ పౌండ్ల నష్ట పరిహారం కోరుతూ కేసులు వేశారు.
→ ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనకా, అరుదైన సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి