Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






‘స్మార్ట్‌’ అస్త్ర ప్రయోగం విజయవంతం!

→ సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పిడో (స్మార్ట్‌) అనే ఆయుధ వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.
→ ఒడిశా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
→ సిమెట్రిక్‌ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
→ ‘స్మార్ట్‌’ అనేది కొత్తతరం క్షిపణి ఆధారిత తేలికపాటి టోర్పిడో వ్యవస్థ. జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
→ భారత నౌకాదళం కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని అభివృద్ధి చేసింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి