Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






‘కాస్మిక్‌ గ్లిచ్‌’ గుట్టు విప్పే సరికొత్త నమూనా!

→ విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్‌ గ్లిచ్‌’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.
→ గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి విస్తృతంగా ఆమోదం పొందిన సూత్రం.. ఐన్‌స్టైన్‌ సాపేక్ష సిద్ధాంతం.
→ ఇది అనేక పరీక్షలు, ప్రయోగాల ద్వారా నిరూపణ అయింది.
→ విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌ బ్యాంగ్‌ను వివరించడం నుంచి కృష్ణబిలాల ఫొటోగ్రఫీ వరకూ అనేక అంశాల్లో ఇది అవసరం.
→ అయితే విశ్వంలో భారీ స్థాయిలో గురుత్వాకర్షణ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిప్పుడు.. అందులో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి.
→ విశ్వం విస్తరిస్తున్నట్లు దాదాపు శతాబ్దం కిందట ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు.
→ ఇది.. విశ్వం అంచుల్లో బలహీనపడుతున్న గురుత్వాకర్షణ ఫలితమని కొందరు విశ్లేషించారు.
→ ‘‘దూరంగా ఉన్న గెలాక్సీలు వేగంగా కదులుతున్నాయి. దాదాపు కాంతివేగంతో అవి తరలిపోతున్నాయి.
→ ఆ స్థాయిలోని పరిణామాలకు ఐన్‌స్టైన్‌ సిద్ధాంతం కూడా సరిపోకపోవచ్చు. ఈ లోపాన్ని ‘కాస్మిక్‌ గ్లిచ్‌’గా పేర్కొంటున్నాం.
→ ఇది వందల కోట్ల కాంతి సంవత్సరాలతో ముడిపడిన అంశం.
→ ఆ స్థాయిలో.. గురుత్వాకర్షణ శక్తి దాదాపు ఒక శాతం మేర బలహీనంగా ఉంటుందని మా సూత్రీకరణ చెబుతోంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన రాబిన్‌ వెన్‌ తెలిపారు.
→ సాపేక్ష సిద్ధాంతంలో వైరుధ్యాలకు కారణాలను వివరించడానికి దాదాపు 20 ఏళ్లుగా భౌతికశాస్త్రవేత్తలు, ఖగోళశాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
→ తాజాగా రూపొందించిన గణిత నమూనా ఈ దిశగా పరిష్కారం చూపుతుందని తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి