కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
→ భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది.→ తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్ చంద్రయానీ’ అని నామకరణం చేశారు.
→ ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు.
→ ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి.
→ ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. టార్డిగ్రేడ్‌లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు.
→ ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది. పుడమిపై చోటుచేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఈ జాతి తట్టుకొని నిలబడింది.
→ అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.
→