Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






కాంగోలో కొత్తరకం ఎంపాక్స్‌

→ దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్‌ విజృంభణను కట్టడి చేయడానికి కాంగో తీవ్రంగా శ్రమిస్తోంది.
→ ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాపించగలదని తేల్చారు.
→ ఈ ఏడాది జనవరి నుంచి కాంగోలో 4,500కుపైగా కేసులు వెలుగు చూశాయి. దాదాపు 300 మంది చనిపోయారు.
→ ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.
→ గత ఏడాది అక్టోబరు నుంచి జనవరి మధ్య తూర్పు కాంగోలోని కమిటుగాలో ఎంపాక్స్‌తో ఆసుపత్రిపాలైన రోగులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
→ మానవుల్లో తీవ్రస్థాయిలో వ్యాప్తిచెందడం వల్ల ఈ వైరస్‌లో ఇటీవల జన్యు ఉత్పరివర్తనలు చోటుచేసుకునట్లు గుర్తించారు.
→ బాధితుల్లో మర్మావయవాల వద్ద గాయాలు ఏర్పడుతున్నాయని, అవి స్వల్పస్థాయిలో ఉండటం వల్ల వాటిని గుర్తించడం కష్టమవుతోందని శస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ గతంలో బాధితుల ఛాతీ, చేతులు, కాళ్లపై గాయాలు కనిపించేవి.
→ ఈ నేపథ్యంలో కొత్త వెర్షన్‌ను గుర్తించడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల వ్యూహాన్ని మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి