దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్‌డబ్ల్యూడీ-200బి సిద్ధం
→ రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్‌ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది.→ ఈ మానవరహిత డ్రోన్‌కు ‘ఎఫ్‌డబ్ల్యూడీ-200బి’ అని పేరు పెట్టినట్లు సంస్థ ప్రతినిధులు సుహాస్ తేజస్‌కంద, ప్రజ్వల్ భట్ తెలిపారు.
→ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో నిర్వహించిన సమావేశంలో వీరు మాట్లాడుతూ.. ఈ మానవరహిత బాంబర్ డ్రోన్ 100 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదని, గంటకు 370 కి.మీ. వేగంతో 12 నుంచి 20 గంటల పాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతమని పేర్కొన్నారు.
→ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఈ బాంబర్‌ను త్వరలోనే రక్షణశాఖకు అందిస్తామని తెలిపారు.
→