యుద్ధ విమానానికి పైలట్‌గా కృత్రిమ మేధ!
→ కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్‌గానూ అది ఎదిగింది.→ తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది.
→ అందులో వైమానిక దళ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్ పయనించడం విశేషం.
→ 1990లలో స్టెల్త్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాక సైనిక విమానయాన రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద పురోగతి ఏఐ సాంకేతికత.
→ ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోనప్పటికీ వెయ్యి ఏఐ ఆధారిత జెట్‌లను 2028 నాటికి ప్రవేశపెట్టాలని అమెరికా వాయుసేన భావిస్తోంది.
→ తాజాగా గగనవిహారం చేసిన ఏఐ నియంత్రిత ఎఫ్-16కు విస్తా అని పేరుపెట్టారు.
→