చందమామ అవతలి భాగంపై పరిశోధనకు చాంగే-6
→ మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది.→ ఇప్పటివరకూ ఆ భాగం నుంచి ఏ దేశమూ నమూనాలను సేకరించలేదు.
→ తాజా ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనతను సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది.
→ చాంగే-6ను వెన్‌చెంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్-5 రాకెట్ ద్వారా ప్రయోగించారు.
→ ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని, వ్యోమనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.
→ చాంగే-6లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీ ఎంట్రీ మాడ్యూళ్లు ఉన్నాయి.
→ ల్యాండర్ భాగంలో ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా అంతరిక్ష సంస్థ/ స్వీడన్‌కు చెందిన పరికరాలు ఉన్నాయి.
→ ఆర్బిటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఐక్యూబ్-క్యూ అనే పేలోడ్ కూడా ఉంది. చంద్రుడి వద్దకు ప్రయోగించిన వ్యోమనౌకల్లో పాకిస్థాన్ పరికరాన్ని చైనా ఉంచడం ఇదే మొదటిసారి. ఐక్యూబ్-క్యూను పాక్, చైనా అంతరిక్ష సంస్థలు రూపొందించాయి.
→ ఇందులో రెండు ఆప్టికల్ కెమెరాలు ఉన్నాయి. చందమామ ఉపరితలాన్ని ఇవి చిత్రీకరిస్తాయి.
→