Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






సునీత అంతరిక్ష యాత్ర వాయిదా

→ భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది.
→ ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్‌ రాకెట్‌ ఎగువ దశలోని ఆక్సిజన్‌ వాల్వ్‌లో సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
→ ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.
→ ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక నింగిలోకి పయనంకావాల్సింది.
→ దీన్ని అటాస్‌ రాకెట్‌.. రోదసిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. యాత్ర కోసం వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు వ్యోమనౌకలోకి ప్రవేశించారు.
→ రాకెట్‌లోని ఆక్సిజన్‌ ప్రెజర్‌-రిలీఫ్‌ వాల్వ్‌లో లోపం తలెత్తినట్లు గమనించి కౌంట్‌డౌన్‌ను నిలిపేసి ప్రయోగాన్ని వాయిదా వేశారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి