శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే!
→ భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.→ అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు.
→ నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఇదొకటి. రెండోది ఆక్సిజన్.
→ ‘‘భూమి మీద నీరు మొత్తాన్నీ సేకరించి, ఈ గ్రహంపైన పరిస్తే 3 కిలోమీటర్ల లోతైన నీటి పొర ఏర్పడుతుంది. శుక్ర గ్రహం విషయంలో ఇలాగే చేస్తే నీరంతా గాల్లోకి వెళ్లిపోతుంది. నేలమీద 3 సెంటీమీటర్ల లోతైన నీటి పొర మాత్రమే మిగులుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఎరిన్ కాంగి చెప్పారు.
→ శుక్రుడిపై ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ గతంలో అనువైన వాతావరణమే ఉండేదని తెలిపారు.
→ ‘‘దాదాపు 100 కోట్ల ఏళ్ల కింద ఈ గ్రహం ఏర్పడినప్పుడు దానిపై కూడా భూమి మీదున్న స్థాయిలో నీరు ఉండేది. అయితే అక్కడి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ మేఘాల కారణంగా ఒకదశలో శక్తిమంతమైన గ్రీన్‌హౌస్ ప్రభావం తలెత్తింది. దీనివల్ల ఆ గ్రహంపై ఉష్ణోగ్రతలు 500 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయాయి. ఫలితంగా అక్కడి నీరు మొత్తం ఆవిరై, అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. అయితే నేడు శుక్ర గ్రహం ఎందుకంత పొడిగా ఉంది? లేదా ఇప్పటికీ ఆ గ్రహం ఎందుకు నీటిని కోల్పోతోందన్నదానిపై నాటి పరిణామం ఎలాంటి వివరణను ఇవ్వడంలేదు’’ అని ఎరిన్ తెలిపారు.
→ తాజా అధ్యయనంలో కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించి అసలు విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. శుక్రుడి ఎగువ వాతావరణంలో ఉన్న ఒక అణువు ఇందుకు కారణమని గుర్తించారు. కార్బన్ డైఆక్సైడ్‌తో నీరు కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. దీన్ని హెచ్‌సీవో+గా అభివర్ణిస్తున్నారు.ఈ రేణువులకు ధనావేశం ఉండటం వల్ల వాతావరణంలోని ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో హెచ్‌సీవో+ అణువులు.. రెండుగా విడిపోతాయి.
→ ఈ ప్రక్రియలో హైడ్రోజన్ పరమాణువులు పూర్తిగా అంతరిక్షంలోకి జారుకుంటాయి.
→ ఫలితంగా.. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఒకటి అక్కడ లభ్యం కావడంలేదు.
→