‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
→ పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది.→ ఈ టీకాను ‘కొవిషీల్డ్’ పేరుతో మనదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసి, మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు పంపిణీ చేసింది.
→ ఈ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది.
→ అంతర్జాతీయ విపణుల్లో కొన్ని టీకా డోసులు మిగిలిపోయినందున వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్ర జెనేకా వెల్లడించింది.
→ కొవిడ్‌కు ఎన్నో రకాల టీకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినందున తమ టీకాకు (వాక్స్‌జెర్‌వ్రియా) డిమాండ్ తగ్గిందని పేర్కొంది.
→ టీకా ఉత్పత్తి, సరఫరాలను ఇప్పటికే నిలిపి వేసినట్లు వివరించింది.
→