Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






తూర్పు కనుమల్లో కనుమరుగవుతున్న క్యాట్‌ఫిష్‌!

→ తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లో 60శాతం దాకా క్యాట్‌ఫిష్‌ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు.
→ ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్‌మెంటల్‌ డీఎన్‌ఏ (ఈ-డీఎన్‌ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు.
→ వీటితో స్థానిక మత్స్య జాతికి ముప్పు ఉందని ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.
→ స్థానిక మత్స్స సంపద తగ్గిపోయి ఉపాధి దెబ్బతింటుందని హెచ్చరించారు.
→ మనదేశంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తూర్పు కనుమలు ఒకటి.
→ ఈ ప్రాంతంలోని జలచరాలపై సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త నీల్దిప్‌ గంగూలీ, డాక్టర్‌ జి.ఉమాపతి బృందం పరిశోధన చేసింది.
→ ఒకప్పుడు చెరువులు, ఆక్వేరియంలో ఆల్గే పెరుగుదలను శుభ్రపరిచే సామర్థ్యం కోసం క్యాట్‌ఫిష్‌లను వదిలారు.
→ ఇవి ఇప్పుడు అన్ని నీటి వనరులను ఆక్రమించాయి. తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లోకి భారీగా విస్తరించాయని సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది.
→ తాము అభివృద్ధి చేసిన ఈ-డీఎన్‌ఏ టెక్నిక్‌ క్యాట్‌ఫిష్‌ను ముందస్తుగానే గుర్తించడంలో సాయపడుతుందని.. తద్వారా ముఖ్యమైన స్థానిక జాతుల చేపల మనుగడకు ముప్పులేకుండా దోహదం చేస్తుందని శాస్త్రవేత్త డాక్టర్‌ ఉమాపతి వివరించారు.
→ ‘ఈ-డీఎన్‌ఏ విధానం కచ్చితమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకుంది.
→ తూర్పు కనుమల వంటి విశాలమైన ప్రాంతాల్లోనూ నీటివనరులను కొన్ని నెలల వ్యవధిలోనే పరీక్షించవచ్చు.
→ ఒక పరీక్షతో 20 చెరువుల్లోని నీటి నమూనాలను తెలుసుకోవచ్చు’అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరి తెలిపారు.
→ ఈ పరిశోధన పత్రం తాజాగా ఎన్విరాన్‌మెంటల్‌ డీఎన్‌ఏలో ప్రచురితమైంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి