Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






నింగిలో రంగురంగుల అరోరాలు

→ చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది. ఫలితంగా భారత్‌లోని లద్దాఖ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఆకాశంలో దేదీప్యమాన అరోరాలు ఏర్పడుతున్నాయి.
→ దీనివల్ల కొన్నిచోట్ల విద్యుత్‌ గ్రిడ్లకు, కమ్యూనికేషన్, ఉపగ్రహ పొజిషనింగ్‌ వ్యవస్థల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడ్డాయి. పెద్ద ఇబ్బందులేమీ తలెత్తలేదు.
→ మే 12న కూడా ఇవి కొనసాగుతాయని అమెరికాలోని నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌వోఏఏ) పేర్కొంది.
→ తాజా సౌర తుపానుకు.. సౌరగోళంలోని ఏఆర్‌13664 అనే ప్రాంతంలో ఏర్పడ్డ ఒక సౌరమచ్చ కేంద్రంగా ఉంది.
→ తాజా సౌర తుపాను వల్ల అమెరికాతోపాటు ఉత్తరార్ధగోళంలోని ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేకియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, పోలండ్‌లోని ఎగువ ప్రాంతాల్లో దేదీప్యమాన అరోరాలు ఏర్పడుతున్నాయి.
→ లద్దాఖ్‌లోని హాన్లే డార్క్‌ స్కై రిజర్వు ప్రాంతంలో ఆకాశం అరుణ వర్ణపు శోభను సంతరించుకుంది.

Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి