Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం విజయవంతం

→ పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది.
→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఎక్స్‌రే పొలారిమీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌పోశాట్‌)ను తీసుకుని పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
→ 22 నిమిషాల తర్వాత 650 కి.మీ. ఎత్తున ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
→ అనంతరం పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యుల్‌-3 (పీఓఈఎం-3) ప్రయోగం నిర్వహించేందుకు వీలుగా రాకెట్‌ నాలుగో ఇంజిన్‌ను మండించి దాని కక్ష్యను 350 కి.మీ.కు తగ్గించారు.
→ ఈ మాడ్యుల్‌లో కేరళకు చెందిన ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ వుమెన్‌ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్‌తో పాటు ఫ్యూయల్‌ సెల్, సిలికాన్‌ ఆధారిత అత్యంత శక్తిమంతమైన బ్యాటరీ, రేడియో శాటిలైట్‌ సర్వీస్‌ వంటి నూతన సాంకేతికత ఆధారంగా పనిచేసే పది పరికరాలు ఉంటాయి.
→ ఇవి సమాచారాన్ని సేకరించడంతో పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తాయి.
→ వీటిల్లో విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ఫ్యూయల్‌ సెల్‌ కీలకమైనది.
→ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న భారత్‌కు రోదసిలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరు అవసరం.
→ ఆ అవసరాన్ని ఫ్యూయల్‌ సెల్‌ తీరుస్తుందని ఇస్రో భావిస్తోంది.
→ ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్‌రే తరంగాల జననస్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్‌పోశాట్‌ను ప్రయోగించింది.
→ 2021లో నాసా ఎక్స్‌రే పొలారిటమెట్రీ ఎక్స్‌ప్లోరర్‌ మిషన్‌ పేరుతో ఓ ప్రయోగాన్ని నిర్వహించింది.
→ తర్వాత ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం భారత్‌ కావడం విశేషం.
→ అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్‌పోశాట్, బ్లాక్‌హోల్స్, న్యూట్రాన్‌ నక్షత్రాలను అధ్యయనం చేయనుంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి