Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






సీబీటీతో దీర్ఘకాల నొప్పి తీవ్రతకు చికిత్స

→ ఫైబ్రోమయలాజియా అనే ఒక రుగ్మత వల్ల దీర్ఘకాల నొప్పి, అలసట, నిద్రలేమి, విషయ గ్రహణ సామర్థ్యంలో అవరోధాలు వంటివి తలెత్తుతుంటాయి.
→ ఇలాంటి వారికి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (సీబీటీ)కి సంబంధించిన రెండు విధానాలతో ఉపశమనం లభిస్తుందని స్వీడన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సీబీటీ అనేది మానసిక చికిత్స.
→ ఇందులో ఆలోచనలు, ధోరణలు, నమ్మకాలు, వాటితో ముడిపడిన వ్యవహారశైలిని మార్చడంపై వైద్యులు దృష్టిసారిస్తుంటారు.
→ తద్వారా సమస్యలను అధిగమించేలా వ్యూహాలను రూపొందించుకోవడంలో బాధితులకు సాయం చేస్తుంటారు.
→ ఇందులో సంప్రదాయ, అనుభవ ఆధారితం అనే రెండు రకాలు ఉంటాయి.
→ ఫైబ్రోమయలాజియా బాధితుల్లో ప్రతికూల ఆలోచనల కట్టడి, నిద్రను మెరుగుపరచుకోవడం, మానసిక ఉల్లాసం, కార్యాచరణ ప్రణాళిక, శారీరక వ్యాయామాలు వంటి వాటికి సంప్రదాయ విధానం సాయపడుతుందని గుర్తించారు.
→ అనుభవ ఆధారిత సీబీటీలో మాత్రం.. నొప్పి, మానసిక అసౌకర్యం, అలసట, విషయగ్రహణ సామర్థ్యంలో సమస్యలు వంటి లక్షణాలకు దారితీస్తుండటం వల్ల గతంలో విస్మరించిన చర్యలు, పరిస్థితులకు రోగిని పదేపదే గురిచేస్తారు.
→ ఈ రెండు రకాల సీబీటీలు ఫైబ్రోమయలాజియా తీవ్రతను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
→ నొప్పి, శారీరక, భావోద్వేగపరంగా ఉపశమనం లభిస్తున్నట్లు తేల్చారు.
→ ఫైబ్రోమయలాజియా సమస్య ఉన్న 274 మందిపై పరిశోధన చేసి ఈ మేరకు గుర్తించారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి