Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






గుండె వైఫల్య బాధితుల్లో మరణం ముప్పు అంచనాకు ‘స్కోర్‌’

→ గుండె వైఫల్యమున్న ఒక వ్యక్తికి మరణం ముప్పు ఎంత మేర పొంచి ఉందన్నది అంచనా వేసే ‘ప్రొటీన్‌ రిస్క్‌ స్కోర్‌’ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ తద్వారా సమస్య తీవ్రతను గుర్తించి, రోగులకు సకాలంలో వైద్యం చేయడానికి వీలవుతుందని వివరించారు. గుండె వైఫల్యం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి
→ . ప్రస్తుతం గుండె వైఫల్యానికి సంబంధించి జీవపరమైన సంక్లిష్టతను గ్రహించి, వాటి ఆధారంగా చికిత్స చేయడానికి మార్గాలు పరిమితంగా ఉన్నాయి.
→ హై థ్రోపుట్‌ ప్రొటియోమిక్స్‌ విధానంతో ఈ ముప్పును ముందుగానే అంచనా వేయవచ్చు. ఇందులో భారీ స్థాయిలో ప్రొటీన్ల వర్గీకరణ ఉంటుంది.
→ అయితే ఈ విధానం ఆధారంగా రోగులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట శాస్త్రీయ ఆధారాలు అవసరం.
→ ఈ నేపథ్యంలో అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ప్రొటీన్‌ రిస్క్‌ స్కోర్‌ను అభివృద్ధి చేశారు.
→ గుండె వైఫల్య సమస్య ఉన్నవారిలో మరణం ముప్పును ఇది ముందుగానే అంచనా వేస్తుంది.
→ ఇందుకోసం 1,351 మందిలో 7,289 ప్లాస్మా ప్రొటీన్లను అధ్యయనం చేశారు. ఇందులో రిస్క్‌ స్కోర్‌ కోసం 38 ప్రత్యేక ప్రొటీన్లను ఎంపిక చేశారు.
→ గుండె వైఫల్య సమస్య ముదిరిపోయిన వారిని గుర్తించడంలో వైద్యులకు ఈ విధానం సాయపడుతుంది.
→ తద్వారా వారికి గుండె మార్పిడి లేదా ఇతర చికిత్స మార్గాలను పరిశీలించడానికి వీలవుతుంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి