Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






భయానికి బ్రెజిల్‌ శాస్త్రవేత్తల చికిత్స

→ ఎముకలు, కండరాల నిర్మాణానికి కారణమైన ఎదుగుదల హార్మోన్లు ఆదుర్దానూ తగ్గిస్తాయి.
→ అది ఎలా జరుగుతుందో బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.
→ మెదడు కింది భాగంలోని పిట్యూటరీ గ్రంథి రక్తంలోకి ఎదుగుదల హార్మోన్లను విడుదల చేసి కణజాల వృద్ధికి తోడ్పడుతుంది.
→ నాడీకణాల్లో ఎదుగుదల హార్మోన్లను స్వీకరించే రిసెప్టార్లు కొరవడినప్పుడు ఆదుర్దా పెరుగుతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
→ మరీ ఎక్కువగా భయపడటం, అపనమ్మకం పెంచుకోవడాన్ని ఆదుర్దాగా నిర్వచించారు.
→ గతంలో విపరీత భయం కలిగించిన ఘటన తాలూకు జ్ఞాపకం పదేపదే గుర్తుకొస్తే మళ్లీ భయం కలుగుతుంది.
→ భయమనేది రోదించడానికీ, శరీరం కంపించడానికీ, కొన్నిసార్లు పక్షవాతానికీ దారితీస్తుంది.
→ నాడీకణాల్లోని ఎదుగుదల హార్మోన్‌ (జీహెచ్‌) రిసెప్టార్‌ను నిస్తేజం చేసినప్పుడు భయం తగ్గిపోయింది. అంటే భయం తాలూకు జ్ఞాపకం పునరావృతం కాలేదన్నమాట.
→ పోస్ట్‌ ట్రొమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్డీ) వంటి రుగ్మతలకు కొత్త మందులను కనుగొనడానికి బ్రెజిల్‌ ప్రయోగం తోడ్పడుతుంది.
→ గర్భవతుల్లో మానసిక ఆందోళన ఏర్పడటానికీ జీహెచ్‌ రిసెప్టార్లే కారణం కావచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి