Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






క్యాన్సర్‌ పునరావృతానికి అడ్డుకట్ట!

→చికిత్స తర్వాత క్యాన్సర్‌ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
→భారత్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌ (ఎన్‌ఐబీఎంజీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. క్యాన్సర్‌ బాధితులకు కీమోథెరపీ ఇస్తుంటారు. ఇందులో భాగంగా క్యాన్సర్‌ కణాల్లోని డీఎన్‌ఏకు హాని కలిగించే మందులను వాడుతుంటారు. ఫలితంగా ఆ కణాలు చనిపోతాయి. తద్వారా క్యాన్సర్‌ తగ్గుముఖం పడుతుంది. కాలం గడిచేకొద్దీ ఈ మందుల ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. దెబ్బతిన్న డీఎన్‌ఏకు మరమ్మతు చేసే వ్యవస్థలను క్యాన్సర్‌ కణాలు వృద్ధి చేసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల కీమోరెసిస్టెన్స్‌ తలెత్తుతుంది. ఫలితంగా మందులు పనిచేయని పరిస్థితి తలెత్తుతుంది.
→అంతిమంగా క్యాన్సర్‌ పునరావృతం కావడం, ఇతర అవయవాలకు వ్యాపించడం జరుగుతుంది.
→దీన్ని ఎదుర్కోవడానికి భారత శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ కణాలకు నిర్దిష్టమైన మరమ్మతు వ్యవస్థలపై పరిశోధన సాగించారు.
→వీరు ఆర్‌ఏడీ54, బీఎల్‌ఎం అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టిసారించారు. కీమోరెసిస్టెన్స్‌ వృద్ధి ప్రక్రియలో వీటికి పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
→ఈ రెండూ కలిసి ఒక జన్యు సమూహాన్ని క్రియాశీలం చేస్తాయని తేల్చారు. ఈ జన్యువులు.. క్యాన్సర్‌ కణాల నుంచి కీమో మందులను తొలగిస్తుంటాయి.
→కీమోరెసిస్టెన్స్‌కు ఇదే ప్రధాన కారణం. ఆర్‌ఏడీ54-బీఎల్‌ఎం చర్యను అడ్డుకునే ఔషధాల కోసం శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు.
→ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో మూడు రకాల మందులకు ఆ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు.
→అవి క్యాన్సర్‌ కణాల్లో డీఎన్‌ఏ మరమ్మతు జరగకుండా చూస్తాయని వారు తెలిపారు. దీనివల్ల కీమోథెరపీ ఔషధాలు సమర్థంగా పనిచేస్తాయన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి