క్యాన్సర్ గుర్తింపునకు కొత్త ఏఐ సాధనం
→ కంటికి కనబడని క్యాన్సర్ కణాలను, జన్యువుల పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మేధ (ఏఐ) సాధనాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు.→ దీన్ని ఇన్ఫరింగ్ సూపర్ రిజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్ (ఐస్టార్)గా వ్యవహరిస్తున్నారు.
→ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓ ఏఐ సాధనం రొమ్ము క్యాన్సర్ కేసును గుర్తించడానికి 32 గంటలు తీసుకోగా, ఐస్టార్ ఆ పనిని తొమ్మిది నిమిషాల్లోనే పూర్తిచేసింది.
→ ఎక్స్‌రే చిత్రాల ద్వారా కానీ, ఇతర సంప్రదాయ పద్ధతుల్లో కానీ వెంటనే గుర్తించలేకపోతున్న క్యాన్సర్లను కూడా ఐస్టార్ వెంటనే గుర్తిస్తోంది.
→ కొందరిలో సహజంగానే క్యాన్సర్‌ను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అది దేహంలో ఎలా, ఎప్పుడు వ్యక్తమవుతోందో కనిపెట్టడానికీ ఐస్టార్ ఉపకరిస్తోంది.
→ తద్వారా ఏయే రోగులు క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొనగలరో ముందే గుర్తించవచ్చు.
→