50 ఏళ్ల తర్వాత చందమామపైకి ల్యాండర్ ప్రయోగించిన అమెరికా
→ దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి ఒక ల్యాండర్‌ను అమెరికా విజయవంతంగా ప్రయోగించినప్పటికీ దాని భవిత అయోమయంలో పడిపోయింది.→ నింగిలోకి బయలుదేరిన 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌక ఇంజిన్‌లో ఇబ్బంది తలెత్తింది.
→ ఈ ల్యాండర్ సౌరఫలకం సూర్యుడికి అభిముఖంగా లేదని ఇంజినీర్లు గుర్తించారు. తగినంత విద్యుదుత్పత్తికి ఇది అవసరం.
→ ఈ ఇబ్బందితో బ్యాటరీలో శక్తి తగ్గిపోయింది. అయితే రీఛార్జ్ చేసేందుకు ఇంజినీర్లు చేసిన ప్రయత్నం ఫలించింది.
→ ప్రొపల్షన్ వ్యవస్థలో వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించారు.
→ ఈ నేపథ్యంలో చంద్రుడిపై ఈ వ్యోమనౌక సాఫీగా దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
→ పెరిగ్రిన్ అనే వ్యోమనౌకను ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్ అభివృద్ధి చేసింది.
→ అంతా సాఫీగా సాగితే ఈ ల్యాండర్ ఫిబ్రవరి 23న జాబిల్లిపై సైనస్ విస్కోసిటాటిస్ అనే ప్రాంతంలో దిగుతుంది.
→ జనవరి 8న వుల్కన్ అనే కొత్త రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని నింగిలోకి ప్రయోగించారు.
→ పెరిగ్రిన్ ల్యాండర్ కోసం 108 మిలియన్ డాలర్లకు ఆస్ట్రోబోటిక్‌తో.. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో పలు సైన్స్ పరికరాలు ఉన్నాయి.
→ వాటిలో.. ఎవరెస్టు పర్వతం నుంచి సేకరించిన రాతి తునక, చిన్న రోవర్లు, మెక్సికోకు చెందిన చక్రాల రోబోలు, వికిపీడియా ప్రతి, కొన్ని ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయి.
→ అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనెడీ, జార్జ్ వాషింగ్టన్, ఐజన్‌హోవర్, ‘స్టార్ ట్రెక్’ టీవీ ధారావాహిక సృష్టికర్త జీన్ రాడన్‌బెర్రీ, ప్రముఖ సైన్స్ కాల్పనిక సాహిత్య రచయిత ఆర్థర్ సి క్లార్క్‌కు సంబంధించిన అవశేషాలు, డీఎన్‌ఏనూ ఈ వ్యోమనౌక చందమామపైకి మోసుకెళుతోంది.
→