కమలం ఆకృతిలో చైనా కొత్త ఉపగ్రహం
→ విశ్వంపై పరిశోధనల కోసం చైనా ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి ఐన్‌స్టీన్ ప్రోబ్ అని పేరు పెట్టింది.→ లాంగ్‌మార్చ్-2సీ రాకెట్ ద్వారా దీన్ని రోదసిలోకి పంపింది. ఈ ఉపగ్రహం బరువు 1.45 టన్నులు. ఇందులో 12 రెక్కలు ఉంటాయి.
→ వాటిలో వైడ్‌ఫీల్డ్ ఎక్స్‌రే టెలిస్కోపులు ఉంటాయి. నక్షత్రాలు తమ జీవిత చరమాంకంలో ‘సూపర్‌నోవా’ అనే విస్ఫోటం ద్వారా పేలిపోతుంటాయి.
→ ఆ సమయంలో వెలువడే మొదటి కాంతి, ఆ తర్వాత వచ్చే గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఎక్స్‌రే తరంగాలు, నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాలు వంటి వాటిపై పరిశోధనల కోసం దీన్ని రూపొందించారు.
→