పుడమి సరాసరి ఉష్ణోగ్రత 14.98 డిగ్రీల సెల్సియస్
→ ప్రపంచ వార్షిక ఉష్ణ రికార్డు గత ఏడాది బద్దలైందని ఐరోపా వాతావరణ సంస్థ ‘కోపర్నికస్’ తెలిపింది. భూతాపానికి సంబంధించి అంతర్జాతీయంగా అంగీకరించిన గరిష్ఠ పరిమితికి ఇది దాదాపుగా చేరువైందని పేర్కొంది.→ పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ మించకూడదని 2015 నాటి ‘పారిస్ ఒప్పందం’లో ప్రపంచదేశాలు ప్రతినబూనాయి. అయితే 2023లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఇది 1.48 డిగ్రీల సెల్సియస్ అధికమని పేర్కొన్నారు.
→ 2024 జనవరి లేదా ఫిబ్రవరితో ముగిసే 12 నెలల కాలంలో ‘1.5 డిగ్రీల సెల్సియస్’ దాటిపోయే అవకాశం కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటివరకూ అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2016 నిలిచింది. దాని కన్నా 0.17 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రత గత ఏడాది నమోదైంది. మొత్తంమీద 2023లో పుడమి సరాసరి ఉష్ణోగ్రత 14.98గా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
→