మిజోరంలో కొత్త రకం పాముజాతి
→ మిజోరం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగం పరిశోధకులు ఆ రాష్ట్రంలో కొత్త రకం పాము జాతి (కోరల్ స్నేక్)ని గుర్తించారు.→ బ్రిటిష్-ఇండియావైద్యుడు గోరే పేరు మీద ఈ పాముకు ‘సినోమైక్రరస్ గోరి’గా నామకరణం చేశారు.
→ మిజోరం వర్సిటీ జంతుశాస్త్రం ప్రొఫెసర్ హెచ్‌టీ లాల్రేమసంగాతో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన మరికొందరు పరిశోధనలో పాలుపంచుకున్నారు.
→ స్థానికంగా ఈ పామును ‘రుల్ హిహ్న’ పేరుతో పిలుస్తారని లాల్రేమసంగా తెలిపారు.
→ సినోమైక్రరస్ గోరి.. మూడు వరకు గుడ్లు పెడుతుందని.. ఇది కొండ, దిగువ ప్రాంతాల్లో జీవిస్తుందని పేర్కొన్నారు.
→ సిస్టమ్యాటిక్, బయోడైవర్సిటీ జర్నల్‌లో జనవరి 10న ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
→