సౌర కుటుంబంలో కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
→సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.→అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. అయితే దాని బరువు.. గురుడిలో ఏడో వంతే ఉందని కనుగొన్నారు.
→ఒకరకంగా ఇది.. మృదువైన కాటన్ కాండీ అంత సాంద్రతను మాత్రమే కలిగి ఉంటుందన్నారు.
→ఈ మెత్తటి గ్రహానికి డబ్ల్యూఏఎస్‌పీ-193బి అని పేరు పెట్టారు. అది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
→అంటే.. 10,800 ట్రిలియన్ కిలోమీటర్లన్నమాట! డబ్ల్యూఏఎస్‌పీ-193 అనే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది.
→ఒక గ్రహం.. తన మాతృతార చుట్టూ తిరిగేటప్పుడు దాని వెలుగులో వైరుధ్యాలు వస్తుంటాయి. దాన్ని విశ్లేషించడం ద్వారా వెలుపలి గ్రహాలను గుర్తిస్తుంటారు.
→2006- 2008, ఆ తర్వాత 2011- 2012లో సేకరించిన డేటాను ‘వైడ్ యాంగిల్ సెర్చ్ ఫర్ ప్లానెట్స్’ అనే అంతర్జాతీయ ప్రాజెక్టు కింద విశ్లేషించినప్పుడు ఈ గ్రహం వెలుగులోకి వచ్చింది.