Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






ఛార్జింగ్‌ అవసరం లేకుండా 50 ఏళ్లు పనిచేసే బ్యాటరీ

→ ఛార్జింగ్‌ అవసరం లేకుండానే 50 ఏళ్లపాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్‌ బ్యాటరీని చైనాకు చెందిన బీటావోల్ట్‌ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోంది.
→ ‘బి.వి.100’గా పిలుస్తున్న ఈ బ్యాటరీ పరిమాణం ఓ నాణెం కంటే తక్కువే. నికెల్‌-63 ఐసోటోప్, డైమండ్‌ సెమీకండక్టర్‌లతో దీన్ని రూపొందిస్తున్నారు.
→ పరీక్షల దశలో ఉన్న ఈ బ్యాటరీ ప్రస్తుతం 100 మైక్రోవాట్ల శక్తిని విడుదల చేస్తోంది.
→ 2025 నాటికి దాని శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక వాట్‌కు పెంచాలన్న లక్ష్యంతో పరిశోధకులు కృషిచేస్తున్నారు.
→ ప్రపంచంలో అణుశక్తిని అత్యంత సూక్ష్మీకరించి అభివృద్ధి చేసిన తొలి బ్యాటరీ ఇదేనని బీటావోల్ట్‌ వెల్లడించింది.
→ ఏరోస్పేస్, కృత్రిమ మేధ పరికరాలు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోలలో దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి