Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






‘కార్బెవ్యాక్స్‌’ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు

→ బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) ఆవిష్కరించిన కొవిడ్‌ టీకా ‘కార్బెవ్యాక్స్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు (ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌) లభించింది.
→ ఇది ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ ప్లాట్‌ఫామ్‌పై మనదేశంలో తయారైన తొలి టీకా.
→ ‘కార్బెవ్యాక్స్‌’ టీకాకు ఎంతో కాలం క్రితమే భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ (డీసీజీఐ) అత్యవసర గుర్తింపు ఇచ్చింది.
→ 18 ఏళ్లు మించిన వారికి ‘బూస్టర్‌ డోసు’ కింద ఈ టీకా ఇచ్చేందుకూ అనుమతి ఉంది.
→ భారత ప్రభుత్వానికి ఇప్పటి వరకు 10 కోట్ల డోసుల కార్బెవ్యాక్స్‌ టీకాను బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సరఫరా చేసింది.
→ ఈ టీకాను దేశవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమంలో ప్రధానంగా 12- 14 ఏళ్ల పిల్లల కోసం వినియోగించారు.
→ ‘కార్బెవ్యాక్స్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు రావడం వల్ల, ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా కొవిడ్‌ టీకాలను ఆవిష్కరించే అవకాశం కలుగుతుందని బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల అన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి