అత్యంత పురాతన కృష్ణబిలమదే
→ విశ్వం పుట్టిన తొలినాళ్లలోనే ఏర్పడిన ఒక కృష్ణబిలాన్ని (బ్లాక్‌హోల్) ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.→ అది తన చుట్టూ ఉన్న నక్షత్ర కూటమిని క్రమంగా మింగేస్తోందని గుర్తించారు.
→ విశ్వం 1,300 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిన మహా విస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) నుంచి ఆవిర్భవించింది.
→ బిగ్‌బ్యాంగ్ జరిగిన 40 కోట్ల సంవత్సరాలకు పుట్టిన కృష్ణబిలాన్ని జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్‌తో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
→ అది సూర్యుడికన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది. ‘జీఎన్-జడ్11’ అనే నక్షత్ర కూటమి (గెలాక్సీ) మధ్యలో అది నెలకొని ఉంది.
→ ఈ గెలాక్సీ మన పాలపుంతకన్నా చాలా చిన్నది. కృష్ణబిలం జీఎన్-జడ్11లోని వాయువులను మింగేస్తున్నందునే గెలాక్సీ కుంచించుకుపోయింది.
→ పరిస్థితి ఇలాగే సాగితే యావత్ నక్షత్ర కూటమీ, దానితోపాటే కృష్ణబిలమూఅంతరించిపోతాయి.
→