చంద్రయాన్-3 నుంచి మళ్లీ సంకేతాలు
→ చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు బెంగళూరులో ధ్రువీకరించారు.→ అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఓ)ను అమర్చారు.
→ ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే (ఎల్‌ఆర్‌ఏ).. జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని ఇస్రో వివరించింది.
→ డిసెంబరు 12 నుంచి ఎల్‌ఆర్‌ఏ నుంచి తమకు సంకేతాలు అందినట్లు పేర్కొంది.
→ చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని తెలిపింది.
→